: హాయ్ ల్యాండ్ లో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు
గుంటూరు సమీపంలోని చినకాకాని దగ్గరున్న 'హాయ్ ల్యాండ్'లో చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ ప్రారంభమైంది. హాయ్ ల్యాండ్ కు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. సుమారు లక్ష మంది అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యేందుకు వస్తారని నిర్వాహకులు అంచనా వేయగా, వారి అంచనాలకు తగ్గట్టుగా వేదిక ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో వారిలో ఉత్సాహం తగ్గకుండా ఉండేందుకు నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో డాన్సర్లు చిరంజీవి హిట్ సాంగ్స్ కు డాన్స్ వేస్తూ అభిమానులను అలరించారు. దీంతో అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు.