: శివుడి భార్యగా జన్మించాలని.. శివాలయంలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి
మూఢభక్తితో శివుడి భార్యగా పుడతానని చెబుతూ ఓ పోస్టు గ్రాడ్యుయేట్ అమ్మాయి తనువు చాలించిన ఘటన గుర్ గావ్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గుర్ గావ్ సమీపంలోని షేర్పూర్ గ్రామానికి చెందిన అనిష శర్మ (22) అనే యువతి పీజీ చదువుతోంది. ఆమెకు దైవభక్తి ఎక్కువ. ఇటీవల ఆమె దగ్గర్లోని ఇచ్చాపురి మందిరానికి వెళ్లింది. అనంతరం పూజలు చేసింది. తరువాత టాయిలెట్ లోకి వెళ్లి నిప్పంటించుకుంది. దీంతో ఆలయ పూజారి గోపాల్ దాస్ స్థానికులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారని, వారు చేరుకునేసరికే ఘోరం జరిగిపోయిందని అన్నారు. అప్పటికే ఆమె మరణించింది.
అనంతరం పోలీసులు ఘటనా స్థలంలో యువతి పర్సు, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. పర్సులో మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా అవతరించాలని ఉందని, అందుకే ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేక తనువు చాలిస్తున్నానని, శివుడు తన కోరిక నెరవేర్చాలని వేడుకొంటున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. దీంతో ఆ పరిసరాల్లో విషాదం నెలకొంది.