: ఎమ్మెల్సీ సతీష్ ను వెంటనే కలవాలంటూ చంద్రబాబు ఆదేశం


బాపట్ల సూర్యలంక బీచ్ లో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్న రాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ తన అనుచరులతో కలసి అక్కడ పార్టీ చేసుకుని, ఆ తర్వాత హరిత రిసార్ట్స్ మేనేజర్, సిబ్బందిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంలో ఆ ఘటనకు సంబంధించిన వివరాలను చంద్రబాబు తెప్పించుకున్నారు. వెంటనే వచ్చి తనను కలవాలంటూ ఎమ్మెల్సీ సతీష్ ని చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడిని ఉదయం వరకు తమ అధీనంలో ఉంచుకున్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News