sharat marar: ‘ఖైదీ నంబర్ 150’ స‌క్సెస్ కావాల‌ని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారు: పవన్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్

దాదాపు తొమ్మిది సంవ‌త్స‌రాల త‌రువాత చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నంబ‌ర్‌ 150’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి పవన్ క‌ల్యాణ్ వ‌స్తారా?  రారా? ప‌్ర‌స్తుతం ప‌వ‌న్‌, చిరంజీవి అభిమానుల్లో ఎంతో ఆత్రుత‌ను నింపుతోన్న ప్ర‌శ్న ఇదే. ఈ అంశంపై ప‌వ‌న్ కల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి స్పంద‌న తెల‌ప‌లేదు. అయితే, ఆయ‌న ఆ వేడుక‌కి రాడ‌నే అధిక శాతం మంది అభిమానులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పవన్ కాటమరాయుడు సినిమా నిర్మాత, పవన్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి 9 ఏళ్ల‌ తర్వాత నటించిన ఖైదీ నెం 150 చిత్రం భారీ సక్సెస్ కావాలని పవన్ కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
sharat marar

More Telugu News