: పిచ్చివాళ్ల స్వర్గంలో బీజేపీ నేతలు.. పదివేల ఏళ్లలోనే అత్యంత ఘోరమైన పాలన: మోదీపై నిప్పులు చెరిగిన శివసేన
బీజేపీపై మిత్రపక్షం శివసేన నిప్పులు చెరిగింది. గత పదివేల ఏళ్లలో ఎన్నడూ ఇంత ఘోరమైన పాలన చూడలేదని విమర్శించింది. మోదీ సర్కారు ఆ రికార్డు బద్దలు కొట్టిందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పెద్దనోట్ల రద్దు నల్లధనాన్ని సమూలంగా తుడిచిపెట్టేస్తుందని భావిస్తున్న బీజేపీ నేతలు పిచ్చివాళ్ల స్వర్గంలో విహరిస్తున్నారని అన్నారు. మోదీ తన నిర్ణయంతో మహిళలను అష్టకష్టాల పాలు చేశారని ధ్వజమెత్తారు. పాతనోట్ల మార్పిడికి అనుమతించలేదని ఓ తల్లి అర్ధనగ్నంగా మారడం ప్రభుత్వ తీరుకు ప్రత్యక్ష ఉదాహరణ అని శివసేన విమర్శలు గుప్పించింది. మిత్రపక్షమే ఇలా దాడికి దిగడంతో ఎలా కౌంటరివ్వాలో తెలియక బీజేపీ నేతల్లో మథనం మొదలైంది.