: అమెరికాలో మరోమారు గర్జించిన గన్.. ఫ్లోరిడా ఎయిర్‌పోర్టులో కాల్పుల మోత.. ఐదుగురి మృతి
అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. విమానాశ్రయం రక్తసిక్తమైంది. ఫ్లోరిడా ఎయిర్‌పోర్టులో ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులతో ఎయిర్‌పోర్టు ఒక్కసారిగా భీతావహంగా మారిపోయింది. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని ఉగ్రదాడిగా అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.