: యువీకి పెళ్లి కలిసి వచ్చిందా?...భార్య అదృష్టం తెచ్చిందా?


టీమిండియా ప్రపంచకప్‌ హీరో, ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కి వివాహం కలిసి వచ్చిందా? భార్య హజెల్‌ కీచ్‌ అదృష్టం తీసుకొచ్చిందా? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. అలా అదృష్టం కలిసి వచ్చింది కనుకే వివాహమైన నెల రోజుల్లోనే భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకొన్నాడని అంటున్నారు. గతేడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా భారత జట్టులో చోటు దక్కించుకుని, గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆ తరువాత పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు రాలేదు.

గత ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున పంజాబ్‌, కోల్‌ కతాపై కీలక ఇన్నింగ్స్‌ లు ఆడి జట్టును ఫైనల్‌ లోకి తీసుకెళ్లాడు. అయినప్పటికీ టీమిండియా తలుపులు తెరుచుకోలేదు. దీంతో మరింత కసిగా 2016-17 రంజీ సీజన్‌ లో ఆడి అద్భుతంగా రాణించాడు. పంజాబ్‌ కెప్టెన్‌ గా 5 మ్యాచ్‌ లు ఆడిన యువీ 84 సగటుతో 672 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండడం విశేషం. దీంతో యువీకి భారత జట్టులో స్థానం కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. వివాహం తరువాత ఈ ఘనతను సొంతం చేసుకోవడంతో క్రెడిట్ మొత్తం అభిమానులు హాజెల్ కీచ్ కు ఇస్తున్నారు. గతంలో కోహ్లీ ఫెయిల్యూర్స్ కు అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మను అభిమానులు నిందించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News