: ప్రయాణికులకు షాక్... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సంక్రాంతి సీజన్ కి ఫ్లాట్ ఫాం టికెట్టు ధర పెరిగింది!
సికింద్రాబాదు రైల్వే స్టేషన్ ప్రయాణికులకు షాకిచ్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సమీపించడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో రద్దీ పెరుగుతుంది. దీనిని అవకాశంగా తీసుకున్న రైల్వే అధికారులు సంక్రాంతి వారం రోజులు ఫ్లాట్ ఫాం టికెట్ల ధరలు పెంచారు. ఈ ధరలు సుమారు వంద శాతం పెంచడం, అంటే రెట్టింపు చేయడం విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా సికింద్రాబాద్ స్టేషన్లో ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు ఫ్లాట్ ఫాం టికెట్టు రేటును 20 రూపాయలు చేసినట్టు సికింద్రాబాద్ అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో పది రూపాయలు ఉన్న ఫ్లాట్ ఫాం టికెట్టు ధర సంక్రాంతి, అయ్యప్ప భక్తుల శబరిమలై యాత్రల నేపథ్యంలో అమాంతం పెంచడం విశేషం.