: నాగర్ కర్నూల్ లో దారుణం...యువతి గొంతు కోసిన విద్యార్థి
ప్రేమోన్మాది బరితెగించాడు. యువతి గొంతుకోసి పరారయ్యాడు. సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని వెలమలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బటర్ ఫ్లై పరిశ్రమలో పనిచేసే ఇంటర్ సెకెండియర్ విద్యార్థిని రాజేశ్వరిని అదే సంస్థలో పని చేసే నరేష్ అనే ప్రేమోన్మాది గొంతుకోసి పరారయ్యాడు. ఆమె ఆర్తనాదాలతో సంఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్థులు ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె ప్రమాదం అంచుల్లో ఉంది. దీనిపై కేసునమోదు చేసిన పోలీసులు, నిందితుడికోసం గాలింపు చేపట్టారు.