: ఆనాడే చెప్పాను కదా... ఈ సినిమాకి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వస్తే బాగుంటుంది!: బాలయ్యతో కేసీఆర్


తన 100వ చిత్రాన్ని తిలకించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు బాలకృష్ణ వెళ్లిన వేళ, వారిద్దరి మధ్యా ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్ 23న చిత్రం ముహూర్తపు షాట్ చిత్రీకరించిన వేళ, కేసీఆర్ తో సహా పలువురు తెలుగు దిగ్గజ హీరోలు హాజరైన సంగతి తెలిసిందే. ఆనాడే కేసీఆర్ ప్రసంగిస్తూ, ఈ సినిమాను చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులతో కలసి చూస్తానని చెప్పారు.

ఇప్పుడు అదే విషయాన్ని బాలయ్యకు గుర్తు చేస్తూ, ఓపెనింగ్ డే రోజు వేదికపై ఉన్న వారంతా స్పెషల్ షోకు వస్తే బాగుంటుందని చెప్పినట్టు తెలిసింది. సినిమాకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, కే రాఘవేంద్రరావు, దాసరి తదితరులను ఆహ్వానించాలని, అందరమూ కలసి చిత్రం చూస్తామని చెప్పగా, దీనిపై స్పందించిన బాలయ్య, అందరినీ ఆహ్వానిస్తున్నానని, ఎవరు వస్తారో, ఎవరు రారో చెప్పలేమని అన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News