: మాఫియా బెదిరింపులతో నిరవధికంగా వాయిదా పడ్డ బాలీవుడ్ సినిమా రిలీజ్
బాలీవుడ్ సినిమా 'కాఫీ విత్ డీ' విడుదల నిరవధికంగా వాయిదా పడింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రంహీం, అతని అనుచరుడు చోటా షకీల్ ల నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్ వల్ల ఈ సినిమా రిలీజ్ ను దర్శక, నిర్మాతలు వాయిదా వేశారు. దావూద్ ఇబ్రహీంపై ఈ సినిమాను నిర్మించారు. సినిమాలో దావూద్ కు సంబంధించిన సీన్లన్నింటినీ తొలగించాలని చోటా షకీల్ ఫోన్ లో బెదిరించాడు. ఈ కాల్స్ కు సంబంధించి నిర్మాత, దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.