: స్పైస్ జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం
స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం బెంగళూరు నుంచి ఢిల్లీకి బయల్దేరిన స్పైస్ జెట్ 136కి హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా సమస్య తలెత్తింది. అయితే, ఢిల్లీ ఎయిర్ పోర్టులో అత్యంత చాకచక్యంగా విమానాన్ని పైలట్ ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో, ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై స్పైస్ జెట్ యాజమాన్యం స్పందించింది. హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ను కోల్పోవడం వల్ల విమానానికి ల్యాండింగ్ సమస్య తలెత్తిందని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని చెప్పింది.