ompuri: అద్భుతమైన నటుడిని కోల్పోయాం: ఓంపురి మృతి ప‌ట్ల‌ మోదీ, కరణ్ జొహార్, సెహ్వాగ్ సంతాపం


ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓం పురి మృతి ప‌ట్ల‌ సినీ, రాజ‌కీయ, క్రీడా రంగ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజ‌స్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తోపాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. అద్భుత‌మైన‌ న‌టుడిని కోల్పోయామ‌ని అన్నారు.

బెడ్ మీద ఆయన అలా ప్రశాంతంగా నిశ్చలంగా పడి వుండటాన్ని నమ్మలేకపోతున్నామ‌ని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. మంచి నటుడిని కోల్పోయామ‌ని, అంతర్జాతీయ సినిమాలకు పనిచేసిన తొలినటుడు ఆయ‌నే అని కరణ్ జొహార్, ప్రముఖ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి అన్నారు. సినీ లోకానికి ఆయన లేని లోటు పూడ్చలేనిదని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు ప‌లువురు క్రీడా రంగ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News