: ఆగ్రహంతో ఊగిపోతూ అకారణంగా టోల్‌ప్లాజా ఉద్యోగిపై భౌతికదాడి.. ఢిల్లీ శివార్లలో ఘటన!
భారీ ట్రాఫిక్ కారణంగా అధిక సమయం టోల్ ప్లాజా వద్దే ఉండవలసి వచ్చినందుకు గానూ ఓ వాహనదారుడు అక్కడి సిబ్బందిపై భౌతిక దాడికి దిగిన ఘటన ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. అతడు దాడికి దిగిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయింది. టోల్‌ప్లాజా ఉద్యోగితో మొదట వాగ్వివాదానికి దిగిన సదరు వాహనదారుడు అనంతరం తీవ్ర ఆగ్రహం తెచ్చుకొని ఈ దాడి చేశాడు. అక్కడ ఉన్న మరికొందరు అతడిని బయటకు తీసుకెళ్లారు. నిన్న జరిగిన ఈ ఘటనపై బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సీసీ టీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.