: కోహ్లీకి ధోనీ మంచి బహుమతి ఇచ్చాడు: ధోనీ కోచ్


టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్న తరువాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా స్పందించి, ధోనీ విజయాలను కీర్తించారు. ఈ సందర్భంగా ధోనీ చిన్ననాటి కోచ్ భట్టాచార్య ఆసక్తికరంగా స్పందించారు. ధోనీ అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడని అన్నారు. ధోనీ నిర్ణయం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కెప్టెన్సీకి రిజైన్ చేసిన ధోనీ, నూతన సంవత్సరం సందర్భంగా కోహ్లీకి మంచి బహుమతినిచ్చాడని పేర్కొన్నారు. ధోనీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News