: సమస్యలు పరిష్కరించాలన్న గ్రామస్తులపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యే


గ్రామంలో సమస్యలపై ఏకరువు పెట్టిన దళితులపై టీడీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు మండిపడ్డారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామంలో ఈరోజు ఉదయం ‘జన్మభూమి’ సభ నిర్వహించారు. దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు ఇతర సదుపాయాలను ఇవ్వడం లేదని ఈ సభకు హాజరైన  గ్రామస్తులు విన్నవించుకున్న సందర్భంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు ఇచ్చే ది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ మైకు విసిరిపారేసిన ఆయన వేదికపై నుంచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News