delhi: ఢిల్లీకి వ‌స్తున్న ఇండిగో విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు!

షార్ట్స్‌లో చూడండి
ఈ రోజు దుబాయ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. విమానంలో పిచ్చి చేష్ట‌లు చేశాడు. విమానంలోని సెక్యూరిటీ నిబంధనలను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో పాటు దాడికి దిగేలా ప్ర‌వ‌ర్తించాడు. విమాన సిబ్బందిని బెదిరించి కోపం తెప్పించాడు. ఏం చేయాలో తెలియ‌క పైలట్ వ‌ద్ద‌కు వెళ్లిన సిబ్బందికి సదరు ఫైల‌ట్ అతడిని కట్టేయమని స‌ల‌హా ఇచ్చాడు. దీంతో అతడిని సీటుకు కట్టేశారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టుకి ఆ విమానం చేరుకోగానే  సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌డిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అత‌డు మ‌ద్యం తాగాడా? అనే విష‌యంపై ఆరా తీస్తున్నారు. ఇటీవలి కాలంలో విమానాల్లో ఇటువంటి ఘటనలు వ‌రుస‌గా చోటుచేసుకుంటున్నాయి.
Go Back to Shorts
delhi
airport

More Telugu News