: చిరంజీవి సినిమాలో నా సీన్లు తొలగించడం చూసి... అమ్మ చనిపోయినంత బాధ వేసింది: నటుడు పృథ్వి
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాప్యులర్ అయిన నటుడు పృథ్వి తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'లో ఆయన నటించిన సన్నివేశాలను తొలగించేశారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "చిరంజీవి సినిమాలో నేను నటించడం నా అదృష్టం. అయితే నా సీన్లు తొలగించడం నా దురదృష్టం. సంక్రాంతి పండుగ రోజున మా అమ్మ చనిపోయినంత బాధగా ఉంది", అని తెలిపాడు.
ట్విట్టర్లో ఈ మేరకు పృథ్వి పెట్టిన ట్వీట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. చిరంజీవి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ దొరికినా చాలని కోరుకున్నానని... అలాంటిది మంచి పాత్ర దొరకడంతో చాలా సంతోషించానని... కానీ, తాను నటించిన సీన్లు తొలగించి వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇండస్ట్రీలోకి రావడానికి చిరంజీవి సినిమాలే కారణమని... అలాంటిది, ఆయన 150వ సినిమాలో తాను లేకపోవడం షాక్ కలిగించిందని చెప్పాడు.