: పదవికి రాజీనామా చేసిన దిలీప్ వెంగ్ సర్కార్
భారత క్రికెట్ దిగ్గజం దిలీప్ వెంగ్ సర్కార్ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. లోథా కమిటీ సిపారసులను కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, వెంగీ వైదొలిగారు. తన నిర్ణయాన్ని లేఖ రూపంలో ఎంసీఏకు తెలిపారు. ఇప్పటికే ఎంసీఏ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ తప్పుకున్న సంగతి తెలిసిందే. 70 ఏళ్లకు పైబడిన వారు క్రికెట్ పాలనా వ్యవహారాల్లో ఉండరాదని లోథా కమిటీ సూచించింది. దీంతో, డిసెంబర్ 17న శరద్ పవార్ రాజీనామా చేశారు.