: 9వ తేదీలోపు ఎవరికెంత బలమో చెప్పండి... ములాయం, అఖిలేష్ లకు ఈసీ ఆదేశం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్, సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తుపై నిర్ణయం తీసుకునేందుకు కదిలింది. సైకిల్ గుర్తు తమకు చెందాలంటే, తమకు చెందాలని ములాయం, అఖిలేష్ వర్గాలు ఈసీని ఆశ్రయించిన నేపథ్యంలో, ఎవరికెంత ప్రజాప్రతినిధుల బలముందో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 9వ తేదీలోపు పార్టీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు ఎవరి వెనుక ఎంతమంది ఉన్నారన్న మెజారిటీ వివరాలను తమకు తెలియజేయాలని సూచించింది. ఆపై సైకిల్ గుర్తు ఎవరికి కేటాయించాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.