: కట్నాన్ని ప్రోత్సహించే మాట్రిమోనియల్ సైట్లపై నిషేధం
వర కట్నాన్ని ప్రోత్సహించే మాట్రిమోనియల్ వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. కట్నాన్ని ప్రోత్సహించేలా ఉన్న వివాహ సంబంధ సైట్లను నిషేధించాలని కోరుతూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయాన్ని బాంబే హైకోర్టుకు తెలిపింది. వరకట్న సమస్యపై బాంబే హైకోర్టులో ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన కేంద్రం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.