cab drivers: హైదరాబాద్ లో క్యాబ్‌ డ్రైవర్ల దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఉద్రిక్తత

ఓలా, ఉబర్‌ సంస్థలలో పనిచేస్తున్న తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద చేస్తోన్న‌ నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. త‌మ‌ సంస్థల వ్యవహారశైలికి నిరసనగా స‌ద‌రు క్యాబ్ డ్రైవ‌ర్లు కొన్ని రోజుల నుంచి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద ధర్నా దీక్ష చేప‌ట్టారు. ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్న పోలీసులు ముందుగా దీక్ష విరమించాలని క్యాబ్‌ డ్రైవర్లకు సూచించారు. అయితే, సమస్యలు పరిష్కారమయ్యే వరకు దీక్ష విరమించ‌బోమ‌ని క్యాబ్‌ డ్రైవర్లు చెప్ప‌డంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు, క్యాబ్‌డ్రైవర్లకు మధ్య తోపులాట జరిగి, వాగ్వివాదం చోటు చేసుకుంది.
cab drivers

More Telugu News