chiranjeevi: కంట తడి పెట్టిస్తున్న ‘మెగాస్టార్’ చిత్రంలోని పాట!

షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’కు సంబంధించి మరో పాటను యూట్యూబ్ లో ఈరోజు విడుదల చేశారు. రైతుల కష్టాలు.. కడగండ్ల నేపథ్యంలో చిత్రీకరించిన ‘నీరు..నీరు.. రైతుకంట నీరుచూడనైన చూడరెవ్వరూ..’ అంటూ సాగే ఈ పాట అన్నదాతలనే కాదు, ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఉంది. ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇంతకుముందు విడుదల చేసిన పాటలకు, ముఖ్యంగా ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ అనే పాటకు భారీ స్పందన వచ్చింది. 
Go Back to Shorts
chiranjeevi

More Telugu News