: చంద్రబాబుకు లోకేష్ భయం పట్టుకుంది: రోజా


యూపీ రాజకీయాలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీపీ వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. యూపీలో ములాయం సింగ్ ను అఖిలేష్ ఎలా దించేశారో చూసి, చంద్రబాబులో భయం పట్టుకుందని... అఖిలేష్ లాగానే తన కుమారుడు లోకేష్ కూడా తనను ఎక్కడ అధికారం నుంచి దించేస్తోడో అనే భయం చంద్రబాబులో ఉందని... ఈ భయంతోనే లోకేష్ ను మంత్రిని కూడా చేయడంలేదని అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లు లేవన్న చంద్రబాబు... పులివెందులకు నీరు ఇస్తామంటే జనాలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.  

  • Loading...

More Telugu News