: 40 ఏళ్ల తరువాత కశ్మీర్ లోని ఆ ప్రాంతంలో హిమపాతం!
అసలే కాశ్మీరం.. ఆపై శీతాకాలం.. ఇక చూసుకోండి!
చలి వణికిస్తుంటుంది. నీళ్లు గడ్డకట్టుకుపోతాయి. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల తరువాత, ఈ సీజన్ లోనే మొదటిసారిగా కశ్మీర్ లో భారీ మంచువర్షం కురిసింది. శ్రీనగర్-గుల్ మార్గ్ రోడ్డు ప్రాంతంలో భారీ స్థాయిలో మంచు కురిసింది. దీంతో ఈ ప్రాంతంలో దట్టంగా మంచు పేరుకుపోయింది. ఐదు నెలలుగా చుక్క వర్షం కురవని ఈ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో పరిసరాలన్నీ శ్వేతవర్ణం సంతరించుకున్నాయి. దీంతో మంచుతో ఆడుకుంటూ పిల్లాపెద్దా పారవశ్యం చెందుతున్నారు.