: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ఎన్నిక.. హాజరుకాని కరుణానిధి


తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా పార్టీ ట్రెజరర్ గా, శాసనసభలో విపక్ష నేతగా, పార్టీలో నెంబర్ టూగా వ్యవహరించిన స్టాలిన్ ఇకపై పార్టీని ముందుండి నడిపించనున్నారు. ఈ రోజు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో స్టాలిన్ ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల పార్టీ అధినేత, స్టాలిన్ తండ్రి కరుణానిధి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. పార్టీ జనరల్ సెక్రటరీ అన్బళగన్ తో పాటు 3వేల మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వాస్తవానికి ఈ కార్యక్రమానికి కరుణానిధి కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈ ఉదయం చెన్నైలోని గోపాలపురంలో ఉన్న కరుణ నివాసానికి వెళ్లిన డాక్టర్లు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో, ఆయన ఇంటి వద్దే ఉండిపోయారు. 

  • Loading...

More Telugu News