: ఆన్ లైన్ లో సిలెండర్ బుక్ చేస్తే 5 రూపాయల తగ్గింపు!
పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటలైజేషన్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గృహ వినియోగదారులను ఆన్ లైన్ సేవలు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ రీఫిల్ ను ఆన్ లైన్ లో బుక్ చేసి పేమెంట్ చేస్తే సిలెండర్ పై 5 రూపాయలు తగ్గించనున్నట్టు ప్రకటించాయి. వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా సంబంధిత గ్యాస్ సంస్థల వెబ్ సైట్ల నుంచి గ్యాస్ సిలిండర్ రీఫిల్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.