: రేణిగుంటలో ఎయిరిండియా విమానం ఎమెర్జెన్సీ ల్యాండింగ్
ఎయిరిండియా విమానం తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. 120 మంది ప్రయాణికులతో రేణిగుంట నుంచి బయల్దేరిన విమానం హైదరాబాదు మీదుగా ఢిల్లీ చేరాల్సి ఉంది. అయితే విమానం బయల్దేరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడాన్ని గుర్తించిన పైలట్ ఎయిర్ కంట్రోల్ కు సమాచారమందించాడు. దీంతో అధికారుల అనుమతితో వెనక్కి తిప్పి, తిరిగి రేణిగుంటలోనే ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. 120 మంది ప్రయాణికులు క్షేమమని ప్రభుత్వం తెలిపింది.