: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొన్న గవర్నర్
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం పరిపాటి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం నుంచి గర్భాలయం వరకు నిర్వహించిన శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనం, అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి వారి దర్శనాన్ని నిలిపివేశారు.