: బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుల సంఖ్య కుదింపు!


లోథా కమిటీ సిఫారసులకు అనుగుణంగా బీసీసీఐలో సంస్కరణల పర్వం ప్రారంభమయింది. నిన్నటి సుప్రీం తీర్పుతో బీసీసీఐ అధ్యక్షుడు, సెక్రటరీలు తమ పదవులను కోల్పోయారు. తాజాగా కమిటీ సిఫారసులకు అనుగుణంగా సెలక్షన్ కమిటీని కుదించే అవకాశం కనపడుతోంది. ప్రస్తుత కమిటీలో ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్ దీప్ సింగ్, గగన్ ఖోడా, జతిన్ లు ఉన్నారు. వీరిలో గగన్ ఖోడా, జతిన్ లకు టెస్ట్ అనుభవం లేదు. మరోవైపు సెలెక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులుంటే చాలని, అవసరమైతే కొందరు సహాయకులను నియమించుకోవచ్చని లోథా కమిటీ సూచిస్తోంది. దీంతో, ఖోడా, జతిన్ లను సమన్వయకర్తలుగా నియమించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంగ్లండ్ తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ లకు జనవరి 5న ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. 

  • Loading...

More Telugu News