: క్షమించండి... గత నెలలో రాలేకపోవడానికి కారణమిదే!: పవన్ కల్యాణ్
తాను గత నెలలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి, ప్రజలను కలుసుకోవాల్సి వుందని, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం ప్రారంభమైంది. గత నెలలో తాను ఇక్కడికి రావాలని ప్రయత్నించిన సమయంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించారని, అందువల్లే ఈ సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, అందుకు తనను క్షమించాలని అన్నారు. ఆ తరువాత తిరిగి సభా ఏర్పాట్లు చేసేందుకు కొంత సమయం పట్టిందని అన్నారు.