: నిండు ప్రాణాన్ని బలిగొన్న యూపీ మంత్రి కారు!


ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మంత్రి కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళ్తే ఓం ప్రకాశ్ సింగ్ యూపీలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన అధికారిక వాహనం హర్దోయి అనే ప్రాంతంలో ఓ హ్యాండ్ కార్ట్ (మనిషి లాగే బండి)ను ఢీకొనడంతో... దాన్ని నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు. కారులో మద్యం బాటిల్ కూడా దొరకడంతో... డ్రైవర్ మందు తాగి కారు నడిపినట్టు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. 

  • Loading...

More Telugu News