: నెల్లూరు జిల్లా కలిగిరి బస్టాండ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
నెల్లూరు జిల్లా కలిగిరి బస్టాండ్ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో పది దుకాణాలు దగ్ధమయ్యాయి. రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.