: నాగార్జున సాగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పోలీసుల మృతి


నాగార్జున సాగర్ లో ఈరోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసు అధికారులు మృతి చెందారు. మృతులందరూ నాగార్జున సాగర్ లో విధులు నిర్వహిస్తున్న వారేనని సమాచారం. సమ్మక్క-సారలమ్మ మలుపు వద్ద వేగంగా వస్తున్న లారీ, పోలీస్ జీపును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News