: చేనేత దుస్తుల్లో కేటీఆర్.. చెప్పినట్టే చేసిన మంత్రి!


తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పినట్టే చేశారు. ప్రతి సోమవారం తప్పనిసరిగా చేనేత దుస్తులు ధరిస్తానని కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన చేనేత దుస్తులు ధరించి ఈరోజు తన కార్యాలయానికి వెళ్లారు. కేటీఆర్ తో పాటు జిల్లాల్లో కలెక్టర్లు, కార్యాలయ అధికారులు, సిబ్బంది సైతం చేనేత దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. తన మాటను గౌరవించి చేనేత దుస్తులు ధరించిన అందరికీ అభినందనలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News