: గడువిస్తే ప్రభుత్వానికి 80 కోట్లు చెల్లిస్తాం: ముసద్దీలాల్
పెద్దనోట్ల నిషేధం అనంతరం పాత నోట్లు మార్చేందుకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసద్దీలాల్ సోదరులకు న్యాయస్థానం విధించిన ఐదు రోజుల పోలీసు కస్టడీ నేటితో ముగిసింది. దీంతో సీసీఎస్ పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారిని విచారించాల్సిన అవసరం ఉందని, మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరో ఐదు రోజులు వారిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. అయితే పోలీసు విచారణలో ముసద్దీలాల్ సోదరులు తమ నేరాన్ని అంగీకరించారు. తమకు సమయం ఇస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సిన 80 కోట్ల రూపాయల ట్యాక్సు చెల్లిస్తామని వారు న్యాయస్థానాన్ని కోరారు.