panner selvam: శాస‌న‌స‌భ‌ను స‌మావేశ‌ప‌ర్చండి.. బలనిరూపణకు సిద్ధపడండి: ప‌న్నీర్‌సెల్వంకి డీఎంకే సూచ‌న‌

షార్ట్స్‌లో చూడండి
జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టి పాలన కొనసాగిస్తున్నారు. అయితే, పన్నీరు సెల్వం శాసనసభలో బలనిరూపణకు సిద్ధపడాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్ చేసింది. శాసనసభను సమావేశపరచాల‌ని కూడా సూచించింది. మ‌రోవైపు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని ప‌లువురు అన్నాడీఎంకే నేత‌లు కోరుతున్న విష‌యం తెలిసిందే. ఆమె సీఎం అవుతార‌ని ఆ రాష్ట్ర‌ మంత్రులు కొందరి నుంచి సంకేతాలు రావ‌డం విశేషం. ఇప్పుడు డీఎంకే కూడా పన్నీర్ సెల్వం బ‌ల‌నిరూప‌ణ‌కు సిద్ధం కావాలని డిమాండ్‌ చేయటంతో మ‌రోసారి త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.
Go Back to Shorts
panner selvam

More Telugu News