: విడాకులకు సిద్ధమైన మరో బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ కు 2016 'విడాకుల నామ సంవత్సరం'గా మిగిలిపోయింది. అనేక జంటలు విడిపోయాయి. కనీసం 2017లో అయినా బాలీవుడ్ జంటలు కలసి మెలసి ఉంటాయని భావించారు. కానీ, కొత్త సంవత్సర వేడుకలు కూడా ముగియక ముందే మరో షాకింగ్ న్యూస్ వెలువడింది. ప్రముఖ నటి, దర్శకురాలు నందితాదాస్ (47) తన ఏడేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించింది.
తన భర్త శుభోద్ మస్కారాతో విడిపోతున్నానని వెల్లడించింది. పిల్లలున్నప్పుడు విడిపోవడం కష్టంగానే ఉంటుందని... కానీ, మా కుమారుడికి ఎలాంటి లోటు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. ఇలాంటి సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను కోరింది. 2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లాడిన నందితా దాస్, 2007లో అతని నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఏడేళ్ల క్రితం నటుడు శుభోద్ మస్కారాను పెళ్లాడింది. వీరిద్దరికీ విహాన్ అనే కుమారుడు ఉన్నాడు.