: నితీష్ కుమార్ ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!


కొత్త సంవత్సరం సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు ఆయన కేబినెట్ మంత్రులు తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన సంపద విలువ కేవలం రూ. 56 లక్షలు మాత్రమే అంటూ నితీష్ తెలిపారు. బ్యాంకులో డిపాజిట్లు, ఢిల్లీలో ఓ ప్లాటు, ఆవులు, బర్రెలు, ఒక ఎక్సర్ సైజ్ సైకిల్, చేతిలో నగదు అన్నీ కలిపి తన సంపద 56 లక్షలు అని ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రి కన్నా ఆయన కుమారుడు నాలుగు రెట్లు రిచ్. ఆయన కొడుకు సంపద రూ. 2.36 కోట్లుగా ఉంది.

ఇక ఆర్జేడీ అధినేత తనయుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అయితే... తనకు సొంత వాహనం కూడా లేదని ప్రకటించారు. కొన్ని చోట్ల ఫ్లాట్లు మాత్రం ఉన్నాయని తెలిపారు. లాలూ మరో కుమారుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం తన వద్ద రూ. 15 లక్షలు విలువ చేసే బైక్, రూ. 29 లక్షల విలువ చేసే కారు, దినాపూర్, పుల్వారి షరీఫ్ లలో ఫ్లాట్లు ఉన్నాయని వెల్లడించారు. మరో మంత్రి తన వద్ద ఒక రైఫిల్, ఒక పిస్టల్ ఉందని తెలిపారు. దాదాపు మంత్రులంతా తమ వద్ద తక్కువ సంపదే ఉన్నట్టు తెలిపారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే... మంత్రులంతా తమ వద్ద కన్నా తమ భార్యల వద్ద ఎక్కువ సంపద ఉన్నట్టు చూపించారు.  

  • Loading...

More Telugu News