pawan kalyan: పవన్‌ కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు ఏర్పాట్లు.. రేపు రోడ్ షో లోనూ పవన్ పాల్గొనే అవకాశం

జనసేన అధినేత, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించ‌నున్నార‌న్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ప‌ర్య‌ట‌న కోసం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఆయ‌న మొదట జిల్లాలోని ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్‌ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను ప‌రామ‌ర్శించి వారి బాధ‌ల గురించి తెలుసుకుంటారు. ఆయ‌న‌ కలుసుకోబోయే రోగుల జాబితాను జన‌సేన నేత‌లు సిద్ధం చేశారు. త‌రువాత అక్క‌డ నిర్వ‌హించ‌నున్న రోడ్ షో లోనూ పవన్ క‌ల్యాణ్ పాల్గొనే అవకాశాలున్నట్లు జ‌న‌సేన శ్రేణులు మీడియాకు చెప్పాయి.
pawan kalyan

More Telugu News