uttam kumar: నగదు విత్ డ్రాపై విధించిన‌ పరిమితులు ఎత్తివేయాలి: టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో దేశంలో సామాన్యులు ఇంకా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు న‌ల్ల‌గొండ జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసి 51 రోజులు గ‌డిచాయ‌ని, ఇప్ప‌టికీ మోదీ ఏం సాధించ‌లేక‌పోయార‌ని వ్యాఖ్యానించారు. దేశంలో ఇంకా నగదు కొరత ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. నగదు విత్ డ్రాపై కేంద్ర ప్ర‌భుత్వం విధించిన‌ పరిమితులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతుల‌ను ఆదుకునేందుకు పంటలపై కనీస మద్దతు ధరకు 20 శాతం బోనస్ ఇవ్వాలని ఆయ‌న అన్నారు.  
Go Back to Shorts
uttam kumar

More Telugu News