: మందు బాబుల కిక్కు దించిన హైదరాబాద్ పోలీసులు... ఏకంగా 500 మందిపై కేసులు


కొత్త సంవత్సరం ప్రవేశించిన వేళ, హైదరాబాద్ రోడ్లపై మందుకొట్టి వాహనాలు నడిపిన వారి మత్తు వదిలింది. పోలీసులు ఎంతగా ప్రచారం చేసినా, అర్ధరాత్రి తరువాత మద్యం తాగి బైకులు, కార్లు నడిపిన వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. మొత్తం 130 ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేసిన పోలీసులు 500 మందిపై కేసులు పెట్టి వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకూ తనిఖీలు సాగాయి. వీరందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News