: జయలలిత కారునే ఉపయోగించిన శశికళ
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు శశికళ బాధ్యతలు స్వీకరించారు. పోయెస్ గార్డెన్ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు జయలలిత వాడిన కారులోనే శశికళ వెళ్లారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ‘చిన్నమ్మ..చిన్నమ్మ’ అంటూ నినాదాలు చేశారు. శశికళ ఫొటోలు, నినాదాలు ఉన్న టీ-షర్టులను ధరించిన ఆమె అభిమానులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసంగించిన శశికళ, జయలలితను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.