: స్మగ్లర్ల కొత్త రూట్...రెడీ మేడ్ దుస్తుల్లో 2,000 నోట్లు బట్వాడా!
పెద్ద నోట్ల రద్దుతో కొత్తగా చలామణిలోకి వచ్చిన 2000 రూపాయల నోట్లు పెద్ద మొత్తంలో పక్కదారి పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కరెన్సీని పెద్ద మొత్తంలో సంపాదించిన స్మగ్లర్లు వాటిని సరిహద్దులు దాటించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు సరికొత్త వ్యూహం రచించారు. అందులో భాగంగా రెడీ మేడ్ వస్త్రాలను ఆయుధంగా ఎంచుకున్నారు. రెడీమేడ్ దుస్తుల్లో మడత సరిగ్గా వచ్చేందుకు మధ్యలో అట్టముక్క పెడతారు. దానిని అలుసుగా తీసుకుని, అందులో రెండువైపులా 2,000 రూపాయల నోట్లు కవర్లలో పెట్టారు. ఈ ప్యాకేజీపై అనుమానం వచ్చిన ముంబై విమానాశ్రయాధికారులు తనిఖీలు నిర్వహించగా, 2,000 రూపాయల నోట్ల కవర్లు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.