: దేశ ఆర్థిక వ్యవస్థ శరీర భాగాలన్నింటినీ మోదీ తొలగించివేశారు: లాలూ విమర్శ
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, పేగులు, రక్తాన్ని మోదీ తీసేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఈ శరీర భాగాలు లేకుంటే ఎవరైనా బతకగలరా? ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి కూడా ఇలాగే ఉంది" అని అన్నారు.
మోదీ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పడమేకాదు... పేద ప్రజల జీవితాలు కోలుకోని విధంగా నాశనమయ్యాయని అన్నారు. అర్థం పర్థం లేని నిర్ణయాలను తీసుకుని... ఇప్పుడు వాటిని కప్పిపుచ్చుకోవడానికి క్యాష్ లెస్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. 'గత 50 రోజుల్లో తన సొంత నిర్ణయాన్ని మోదీ ఎన్నిసార్లు సవరించారో చూస్తేనే తెలుస్తుంది... మోదీ నిర్ణయం ఎలాంటిదో!' అంటూ ఎద్దేవా చేశారు.