: కల్పనపై వేటు వేయండి... వైసీపీ ఫిర్యాదు


కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. వైపీసీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచి, టీడీపీలో చేరిన కల్పనపై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన వారిలో వైసీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు ఉన్నారు.  

  • Loading...

More Telugu News