: ప్రయాణికులకు న్యూ ఇయర్ బహుమతి ఇచ్చిన రైల్వే
ప్రయాణికులకు భారత రైల్వే కొత్త సంవత్సర ఆఫర్ ను ప్రకటించింది. రైళ్లలో రిజర్వేషన్ చార్టు ఖరారయిన తర్వాత ఇంకా ఖాళీ బెర్తులు ఉంటే... వాటికి 10 శాతం తగ్గింపును ఇస్తామని ప్రకటించింది. ఈ సదుపాయం జనవరి 1వ తేదీ నుంచి ఆరు నెలల పాటు కొనసాగుతుందని తెలిపింది. ఏసీ, స్లీపర్ సహా అన్ని రిజర్వేషన్ సీట్లకు ఈ సదుపాయం వర్తిస్తుందని వెల్లడించింది. అయితే, సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీలు, రిజర్వేషన్ ఛార్జీలు మాత్రం ఎప్పటిలాగానే వసూలు చేస్తారు.