kohli: అనుష్కశర్మతో ఎంగేజ్ మెంట్ వార్తలు అవాస్తవం: మండిపడ్డ విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మకి మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగనున్నట్టు ఇటీవల వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రముఖ న్యూస్ ఛానెల్స్ కూడా ఈ న్యూస్‌ని ప్రసారం చేయడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని నరేంద్రనగర్ లోని ఆనంద హోటల్ లో వీరి నిశ్చితార్థం జరగనున్నట్టు కథనాలు వెలువడ్డాయి.
అంతేగాక, ఈ వేడుకకు అంబానీ, బచ్చన్, కపూర్ల కుటుంబాలతో పాటు ఎందరో ప్రముఖులు హాజరవుతారని చెప్పుకున్నారు. అయితే, దీనిపై చివరికి విరాట్ కోహ్లీ స్పందించాల్సి వచ్చింది. అనుష్కశర్మతో ఎంగేజ్ మెంట్ వార్తలు అవాస్తవం అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో కొద్దిసేపటి క్రితం పేర్కొన్నాడు. తాను ఎంగేజ్ మెంట్ వేడుక చేసుకుంటే అన్ని వివరాలు దాచిపెట్టకుండా వెల్లడిస్తాను కదా? అని కోహ్లీ మండిపడ్డాడు.

" we aren't getting engaged & if we were going to,we wouldn't hide it. Simple... (1/2)
— Virat Kohli (@imVkohli) 30 December 2016