: దుండగుల దాడిలో ఇద్దరి మృతి... మరో ఇద్దరికి గాయాలు.. తూర్పుగోదావరిలో ఘటన
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కోరుకొండ మండలం మధురపూడిలో నలుగురు వ్యక్తులపై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడిచేశారు. వారి దాడిలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంటి సరిహద్దు విషయంలో నెలకొన్న వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన ఇద్దరు కత్తిపోట్లకు గురవడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.