: తిరుపతిలో రిలయన్స్ మార్ట్‌కు నిప్పు పెట్టిన దొంగ.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
తిరుపతిలోని రిలయన్స్ మార్ట్‌లోకి ప్రవేశించిన ఓ దొంగ దానికి నిప్పు పెట్టాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎగసి పడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు. మార్ట్‌లోకి దొంగ ప్రవేశించడాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన సెక్యూరిటీ గార్డులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో దొంగ మార్ట్‌కు నిప్పు పెట్టి పరారయ్యాడు. దీంతో సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.